'భీష్మ' నుంచి యూత్ ను ఆకట్టుకునే సాంగ్
- నితిన్ తాజా చిత్రంగా రూపొందిన 'భీష్మ'
- ఈ నెల 21వ తేదీన విడుదల
- అభిమానుల్లో పెరుగుతున్న అంచనాలు
"నీ నవ్వేమో సూపర్ క్యూటే .. నీ వైటు చున్నీ సూపర్ క్యూటే .. ఓ లుక్కుతోటి పెంచావే నాలో హార్టు బీటే .." అంటూ ఈ పాట సాగుతోంది. నితిన్ - రష్మికలపై విదేశాల్లో చిత్రీకరించిన ఈ పాట ఆకట్టుకునేలా వుంది. పోస్టర్స్ వదిలిన దగ్గర నుంచే నితిన్ - రష్మిక జోడీ బాగుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వరుస పరాజయాలతో వున్న నితిన్ కి ఈ సినిమా ఉత్సాహాన్నిస్తుందేమో చూడాలి.