'అన్నమయ్య' హిట్ ను ముందే ఊహించాను: నిర్మాత దొరస్వామిరాజు
తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. " మేడసాని మోహన్ గారు నాకు 'అన్నమయ్య' గురించి చెప్పినప్పుడు సినిమా తీస్తే బాగుండుననిపించింది. ఆ మాటను రాఘవేంద్రరావుగారికి చెప్పగానే వెంటనే అంగీకరించారు. ఈ సినిమాలో ఎక్కువ భాగాన్ని రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోను .. అన్నపూర్ణ స్టూడియోస్ లోను చిత్రీకరించాము. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని ఊహించాను. కాకపోతే నాకు ఈ స్థాయిలో పేరు వస్తుందని మాత్రం అనుకోలేదు" అని చెప్పుకొచ్చారు.