ఇటలీలో సందడి చేస్తున్న 'రెడ్'
- రామ్ .. కిషోర్ తిరుమల నుంచి మరో సినిమా
- యూత్ ను ప్రధానంగా చేసుకుని సాగే కథాకథనాలు
- ఏప్రిల్ 9వ తేదీన విడుదల
ప్రస్తుతం పాటల చిత్రీకరణను పూర్తిచేసే పనిలో వున్నారు. ఇటలీలో రెండు పాటలను ప్లాన్ చేశారు. అక్కడి వివిధ లొకేషన్స్ లో పాటలను చిత్రీకరిస్తున్నారు. ఏప్రిల్ 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇంతకుముందు రామ్ - కిషోర్ తిరుమల కాంబినేషన్లో 'నేను శైలజ'.. 'ఉన్నది ఒకటే జిందగీ' సినిమాలు వచ్చాయి. 'నేను శైలజ' యూత్ నుంచి మంచి మార్కులు కొట్టేసింది. 'రెడ్' సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి మరి.