'జబర్దస్త్' షో నుంచి తప్పుకోనున్న అనసూయ?
- పాప్యులర్ కామెడీ షోగా 'జబర్దస్త్'
- అనసూయకి మంచి క్రేజ్ తెచ్చిన షో
- 'లోకల్ గ్యాంగ్'లో సందడి చేస్తున్న అనసూయ
'జబర్దస్త్' నిర్వాహకుల నియమం ప్రకారం, ఏక కాలంలో ఎవరూ రెండు షోలలో కనిపించకూడదు. ప్రస్తుతం అనసూయ ఒక వైపున 'జబర్దస్త్' చేస్తూనే, మరో వైపున వేరే చానల్లో 'లోకల్ గ్యాంగ్స్' కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తోంది. 'జబర్దస్త్'లో అనసూయ కొనసాగడానికి ఇప్పుడు ఇదే అభ్యంతరమైందట. అందువలన త్వరలో ఈ కార్యక్రమంలో అనసూయ కనిపించకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.