కేసీఆర్, రామేశ్వర్‌రావు ఇచ్చే కమిషన్లకు కక్కుర్తి పడ్డారు: రేవంత్ రెడ్డి
- పంటలకు ధరలు ఎందుకు పెంచడం లేదు?
- రైతుబంధు ఎన్నికలబంధుగా తయారైంది
- ప్రహ్లాద్ జోషితో రామేశ్వరరావు భేటీ కావడం వెనుక కిషన్ రెడ్డి, లక్ష్మణ్ ఉన్నారు
కేసీఆర్, మైహోం రామేశ్వరావు ఇచ్చే కమిషన్లకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ కక్కుర్తి పడ్డారని రేవంత్ ఆరోపించారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో రామేశ్వరరావు భేటీ కావడం వెనుక కిషన్ రెడ్డి, లక్ష్మణ్ ఉన్నారని చెప్పారు. జైజ్యోతి సిమెంట్ కంపెనీని తిరిగి తెరిపించి... రామేశ్వరరావుకు ఆర్థిక ప్రయోజనాలను కల్పించడానికే ఇదంతా అని అన్నారు. కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడానికి టీఆర్ఎస్ కు బీజేపీ బీటీమ్ గా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.