రమేశ్ వర్మ సినిమాకి గ్యాప్ తీసుకోని రవితేజ
- 'క్రాక్' సినిమా షూటింగులో రవితేజ
- మే 8వ తేదీన విడుదల
- తదుపరి సినిమా దర్శకుడిగా రమేశ్ వర్మ
ఇప్పటికే ఆయన నుంచి 'డిస్కోరాజా' వచ్చేసింది. ఇక తదుపరి సినిమాగా ఆయన 'క్రాక్' చేస్తున్నాడు. ఈ సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. మే 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత రవితేజ ఏ మాత్రం గ్యాప్ తీసుకోవడం లేదట. వెంటనే రమేశ్ వర్మతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నట్టు చెబుతున్నారు. ఈ ఏడాది చివరిలోనే ఈ సినిమాను కూడా విడుదల చేసే ఆలోచనలో వున్నారు. ఈ రెండు సినిమాలు సక్సెస్ అయితే రవితేజ మళ్లీ పుంజుకున్నట్టే.