హైదరాబాద్‌లో ఇక డీజిల్ వాహనాలకు చెల్లుచీటీ.. 12 ఏళ్లు దాటితే నిషేధం?
- డీజిల్ వాహనాలపై పన్నును భారీగా పెంచాలని నిర్ణయం
- ఎలక్ట్రిక్ వాహనాలకు పన్ను మినహాయింపు ఇవ్వాలన్న యోచన
- ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న ప్రభుత్వం
నగరంలో ప్రస్తుతం 15 లక్షల డీజిల్ వాహనాలు తిరుగుతున్నాయి. వీటి నుంచి పెద్ద ఎత్తున కార్బన్ ఉద్గారాలు విడుదలవుతున్నాయి. దీంతో డీజిల్ ఆధారిత వాహనాల సంఖ్య మరింత పెరగకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. పెట్రోలు వాహనాలతో పోలిస్తే డీజిల్ వాహనాలపై ప్రస్తుతం రెండు శాతం పన్ను అదనంగా వసూలు చేస్తున్నారు. దీనిని మరింత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే, ఎలక్ట్రిక్ వాహనాలకు పన్ను మినహాయింపు ఇవ్వడం ద్వారా ప్రజలను అటువైపు ఆకర్షించాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనల తయారీలో రవాణా శాఖ అధికారులు తలమునకలై ఉన్నట్టు తెలుస్తోంది.