కరోనా నేపథ్యంలో డాక్టర్లు, నర్సుల పట్ల హీరో రాజశేఖర్ సానుభూతి
- చైనాలో మరణమృదంగం మోగిస్తున్న కరోనా వైరస్
- వెయ్యికి సమీపిస్తున్న మృతుల సంఖ్య
- పలువురు వైద్య సిబ్బందికి కరోనా వైరస్
- ఆందోళన వ్యక్తం చేసిన రాజశేఖర్
"మీరు అందిస్తున్న సేవల పట్ల గర్విస్తున్నాం. కరోనా వైరస్ సోకకుండా మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి" అంటూ సూచించారు. సినిమాల్లోకి రాకముందు రాజశేఖర్ కూడా డాక్టరేనన్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ బహిర్గతమై కొన్ని వారాలు గడుస్తున్నా ఇప్పటివరకు ఎవరూ డాక్టర్ల గురించి స్పందించకపోగా, స్వయానా డాక్టర్ కావడంతోనే రాజశేఖర్ వైద్యసిబ్బంది ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు.