'వరల్డ్ ఫేమస్ లవర్' చిత్రం నుంచి 'కొమసావా ప్యారిస్' గీతం విడుదల
- విజయ్ దేవరకొండ హీరోగా 'వరల్డ్ ఫేమస్ లవర్'
- ప్రేమికుల రోజు కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం
- తాజాగా సరికొత్త వీడియో సాంగ్ రిలీజ్ చేసిన చిత్రబృందం
ఈ క్రమంలో తాజాగా వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం నుంచి 'కొమసావా ప్యారిస్' అనే వీడియో గీతాన్ని రిలీజ్ చేశారు. గోపీసుందర్ సంగీతంలో రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించిన ఈ గేయాన్ని బెన్నీ దయాళ్ ఆలపించారు. "జీవితంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి. రండి 'కొమసావా ప్యారిస్' గీతంతో ప్రేమలో పడండి" అంటూ ఈ చిత్ర నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ ట్వీట్ చేసింది.