ప్రభాస్ సినిమా నుంచి ఫస్టులుక్ ను ఆ రోజున రిలీజ్ చేస్తారట
- రొమాంటిక్ లవ్ స్టోరీతో రానున్న ప్రభాస్
- 'ఓ డియర్' టైటిల్ ఖరారు చేశారనే టాక్
- ఉగాది రోజున ఫస్టులుక్ రిలీజ్
ఈ సినిమాకి 'జాన్' అనే టైటిల్ అనుకున్నారు. ఇదే టైటిల్ ను ఖరారు చేయవచ్చని కూడా చెప్పుకున్నారు. కానీ 'ఓ డియర్' .. 'రాధే శ్యామ్' అనే టైటిల్స్ తెరపైకి వచ్చాయి. ఈ రెండు టైటిల్స్ లో 'ఓ డియర్'ను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. 'ఉగాది' పండుగ రోజైన మార్చి 25వ తేదీన టైటిల్ తో కూడిన ఫస్టులుక్ పోస్టర్ ను విడుదల చేయనున్నారని సమాచారం. ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ కోసం ప్రభాస్ అభిమానులంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.