ఈ రేంజ్ లో 'క్రాక్' ఉన్నవాడే కరెక్ట్ అనుకుంటారట
- పోలీస్ ఆఫీసర్ పాత్రలో రవితేజ
- కీలకమైన పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్
- మే 8వ తేదీన భారీస్థాయి విడుదల
'కిక్' టైటిల్ రవితేజ పాత్రకి ఎంత కరెక్ట్ గా అనిపించిందో, 'క్రాక్' టైటిల్ కూడా అలాగే అనిపిస్తుందని అంటున్నారు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో రవితేజ ఫుల్ ఎనర్జీతో చేసే ఎపిసోడ్స్ చూసి తీరవలసిందేనని చెబుతున్నారు. శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, వరలక్ష్మీ శరత్ కుమార్ ఒక కీలకమైన పాత్రలో కనిపించనుంది. మే 8వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు.