టాటా ఏస్ ను ఢీకొట్టిన టిప్పర్... ఐదుగురు దుర్మరణం!
- కుమారుడికి వైద్యం చేయించి తీసుకెళుతున్న కుటుంబం
- వేగంగా వచ్చి ఢీకొట్టిన గ్రానైట్ లోడ్ తో ఉన్న టిప్పర్
- కేసును దర్యాఫ్తు చేస్తున్న పోలీసులు
ఇటీవల మేకల బాబు అనే యువకుడు బైక్ నుంచి కిందపడగా, అతనికి కరీంనగర్ లో వైద్యం చేయించి, ఇంటికి తీసుకుని వెళుతున్న వేళ ఈ ఘటన జరిగింది. మృతుల్లో బాబుతో పాటు అతని తండ్రి మేకల నర్సయ్య, సోదరుడు బానయ్య, సోదరుడి కుమారుడు శేఖర్ మరణించారు. దీంతో ఆ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు టిప్పర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.