'భీష్మ' నుంచి సరాసరి సాంగ్ ఫస్టు గ్లిమ్ప్స్
- వెంకీ కుడుముల నుంచి 'భీష్మ'
- సంగీత దర్శకుడిగా మహతి స్వరసాగర్
- రేపు సాయంత్రం లిరికల్ వీడియో రిలీజ్
గ్రామీణ నేపథ్యంలో చిత్రీకరించిన ఈ పాట ఆహ్లాదంగా సాగుతోంది. మహతి స్వర సాగర్ అందించిన సంగీతం .. శ్రీమణి సాహిత్యం .. అనురాగ్ కులకర్ణి ఆలాపన ఆకట్టుకునేలా వున్నాయి. రేపు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకి లిరికల్ వీడియోను వదలనున్నారు. ఈ నెల 21వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. నితిన్ .. రష్మిక జోడీని తెరపై చూడటానికి అభిమానులు ఆసక్తితో వున్నారు. ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి మరి.