'జాను' తొలిరోజు వసూళ్లు
- నిన్ననే థియేటర్లకు వచ్చిన 'జాను'
- యూఎస్ లో అంతగా లభించని ఆదరణ
- శని .. ఆదివారాల్లో వసూళ్లు పెరిగే ఛాన్స్
'దిల్' రాజు నిర్మించిన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజున 2.4 కోట్ల షేర్ ను రాబట్టింది. శర్వానంద్, సమంతకి గల క్రేజ్ ను బట్టి చూసుకుంటే ఇవి తక్కువ వసూళ్లేనని అంటున్నారు. ఇక యూఎస్ లోను ఈ సినిమా వసూళ్లు అంతంత మాత్రంగానే వున్నాయని చెబుతున్నారు. శని .. ఆదివారాల్లో ఈ సినిమా వసూళ్లు పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. తమిళంలో కాసుల వర్షాన్ని కురిపించిన ఈ కథ, తెలుగులోనూ ఆ దిశగా పరుగులు తీస్తుందేమో చూడాలి.