మహేశ్ చేతుల మీదుగా రేపు రానున్న 'ఓ పిట్టకథ' టీజర్
- వినోదమే ప్రధానంగా 'ఓ పిట్టకథ'
- ఉత్కంఠను రేకెత్తించే మలుపులు
- దర్శకుడిగా చెందు పరిచయం
ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి మహేశ్ బాబు చేతుల మీదుగా ఒక టీజర్ ను రిలీజ్ చేయించనున్నారు. రేపు సాయంత్రం 5 గంటల 5 నిమిషాలకి ఈ టీజర్ ను వదలనున్నారు. వినోదభరితమైన సన్నివేశాలతో ఉత్కంఠభరితంగా ఈ కథ నడుస్తుందని దర్శకుడు చెందు చెప్పాడు. మొదటి నుంచి చివరివరకూ ఈ సినిమా ఆసక్తికరంగా సాగుతుందని అన్నాడు. విశ్వంత్ .. సంజయ్ .. బాలరాజు .. నిత్య శెట్టి .. బ్రహ్మాజీ ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలను పోషించారు.