యాంకర్ ప్రదీప్ ను చూస్తూ మా అమ్మ అలా అనేది: నటుడు అభినవ్ గౌతమ్
- చిన్నప్పటి నుంచి సినిమాలు చూసేవాడిని
- ఆర్టిస్టును కావాలని అప్పట్లో అనుకోలేదు
- యాంకర్ ప్రదీప్ నా సీనియరన్న అభినవ్
నేను ఇంజనీరింగ్ ఫస్టు ఇయర్ చదువుతున్నప్పుడు, అదే కాలేజ్ లో యాంకర్ ప్రదీప్ ఫోర్త్ ఇయర్లో ఉండేవాడు. కాలేజ్ ఫంక్షన్స్ లో ఆయన స్టేజ్ పై డాన్సులు చేసేవాడు. ఆ తరువాత యాంకర్ గా బాగా పాప్యులర్ అయ్యాడు. ఆయన నా సీనియర్ అని టీవీలో చూపిస్తూ మా అమ్మకి చెప్పాను. అప్పటి నుంచి 'నువ్వు కూడా అలా చేయవచ్చు గదా' అని మా అమ్మ మొదలెట్టింది. కష్టపడి యాంకర్ ప్రదీప్ ఈ స్థాయికి వచ్చాడు. అందువల్లనే నేను కూడా గట్టి పట్టుదలతో నటుడిగా అడుగులు వేశాను" అని చెప్పుకొచ్చాడు.