ఏప్రిల్ నుంచి బీఎస్-6 ఇంధనం.. పెరగనున్న ధరలు!
- మార్చి 31తో బీఎస్-4 వాహనాలకు చెక్
- ఏప్రిల్ 1 నుంచి బీఎస్-6 ప్రమాణాలతో వాహనాలు
- అందుకు అనుగుణంగా పెరగనున్న ఇంధన ధరలు
ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోలు ధర రూ.73.36గా ఉండగా, డీజిల్ ధర రూ.66.36గా ఉంది. ఇప్పుడు బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా ఇంధనాన్ని ఉత్పత్తి చేసేలా రిఫైనరీలను మార్చడానికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రూ.17 వేల కోట్లు పెట్టుబడి పెట్టింది. మొత్తంగా అన్ని పరిశ్రమలు కలిసి రూ.30 వేల కోట్ల వరకు ఖర్చు చేస్తున్నాయి. ఏప్రిల్ 1 నుంచి నూతన ప్రమాణాలతో కూడిన ఇంధనాన్ని ఉత్పత్తి చేయనున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ సంజయ్‌సింగ్ తెలిపారు. బీఎస్-4 ప్రమాణాలతో పోలిస్తే కొత్త ప్రమాణాల ప్రకారం ఇంధనం ధరలు అధికంగా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు.