ఆసక్తిని రేకెత్తిస్తున్న 'అశ్వద్ధామ' ట్రైలర్
- స్వయంగా రాసుకున్న కథలో నాగశౌర్య
- యాక్షన్ .. ఎమోషన్ కి ప్రాధాన్యత
- ఈ నెల 31వ తేదీన భారీ విడుదల
ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ .. యాక్షన్ - ఎమోషన్ .. ఛేజింగ్ సీన్స్ పై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. చూస్తుంటే ఒక మర్డర్ మిస్టరీని హీరో ఛేదించడమే ప్రధాన కథాంశంగా కనిపిస్తోంది. "ఎటు వెళ్లినా మూసుకుపోతున్న దారులు .. ఒకరితో ఒకరికి సంబంధం లేని వ్యక్తులు .. వేట కుక్కల్లా వెంటపడే జాలరులు .. శకునిలాంటి ఒక ముసలోడు. వీళ్లందరినీ ఒకే స్టేజ్ పై ఆడిస్తున్న సూత్రధారి ఎవరు?" అనే నాగశౌర్య డైలాగ్ ఆసక్తిని రేకెత్తిస్తోంది.