తెలుగులో 100వ సినిమా కథ కోసం వెయిట్ చేస్తున్నాను: సీనియర్ హీరో సుమన్
- ఇంతవరకూ 400 సినిమాలు చేశాను
- హీరోగా మూడు భాషల్లో 150కి పైగా సినిమాలు
- తెలుగులో హీరోగా 99 సినిమాలు చేశానన్న సుమన్
అలాంటి నాకు ఒక తమిళ సినిమాలో హీరోగా చేసే అవకాశం రావడం .. అక్కడి నుంచి నటుడిగా నా ప్రయాణం మొదలుకావడం జరిగింది. తెలుగు .. తమిళ .. కన్నడ భాషల్లో కలుపుకుని హీరోగా 150 సినిమాలకి పైగా చేశాను. మొత్తంగా 400 సినిమాలను పూర్తి చేశాను. ఒక్క తెలుగులోనే హీరోగా 99 సినిమాలు చేశాను. 100వ సినిమాకి అన్నీ కుదరాలనే ఉద్దేశంతో మంచి కథ కోసం వెయిట్ చేస్తున్నాను. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన నేను, ఇన్ని సినిమాలను చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు" అని చెప్పుకొచ్చారు.