సెన్సార్ పూర్తి చేసుకున్న 'డిస్కోరాజా'
- రవితేజ ద్విపాత్రాభినయం
- ముగ్గురు కథానాయికలు
- ఈ నెల 24వ తేదీన విడుదల
ముందుగా చెప్పినట్టుగానే ఈ సినిమాను ఈ నెల 24వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తుండగా, ఆయన సరసన నభా నటేశ్ .. పాయల్ .. తాన్యా హోప్ అలరించనున్నారు. ముఖ్యమైన పాత్రల్లో సునీల్ .. వెన్నెల కిషోర్ కనిపించనున్నారు. రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ సినిమాకి తమన్ అందించిన సంగీతం ప్రత్యేకంగా నిలవనుందని అంటున్నారు. ఈ సినిమాపై రవితేజ పెట్టుకున్న ఆశలు ఎంతవరకూ ఫలిస్తాయో చూడాలి.