బాలకృష్ణకి కోపం ఎక్కువే .. కానీ దానికో కారణం వుంటుంది: పోసాని
కావాలని ఆయన ఎవరినీ ఏమీ అనరు. తనకి అనిపించింది ముఖాన్నే చెప్పేస్తారు .. మనిషి ముందు ఒక మాట .. తరువాత ఒకమాట ఆయనకి తెలియదు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరినీ ఆయన సమానంగానే చూస్తారు. తన తోటివారికి ఏదైనా సమస్య వుంటే పట్టించుకుంటారు. అవినీతి .. అక్రమాలు అనేవి ఆయనకి అసలే తెలియదు. రామారావుగారి కుమారుడే అయినా, కష్టపడి పైకొచ్చారు" అని చెప్పుకొచ్చారు.