'ఆర్ఆర్ఆర్' సినిమాలో తాను నటిస్తున్నానని వస్తోన్న వార్తలపై స్పష్టతనిచ్చిన కిచ్చా సుదీప్
- ఆ సినిమాలో నేను నటిస్తున్నానంటూ వస్తున్న వార్తలు అవాస్తవం
- ఇప్పటివరకు నన్ను ఆ సినిమా బృందం సంప్రదించలేదు
- ట్వీట్ చేసిన సుదీప్
బాహుబలి వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత ఎస్.ఎస్.రాజమౌళి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో అసలు సిసలైన మల్లీస్టారర్ సినిమా వస్తుండడంతో ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా చెర్రీ, కొమరం భీమ్‌గా తారక్ నటిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 20న ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.