'వరల్డ్ ఫేమస్ లవర్' నుంచి ఫస్టు సింగిల్ వచ్చేస్తోంది
- విజయ్ దేవరకొండ నుంచి రొమాంటిక్ లవ్ స్టోరీ
- 20వ తేదీ సాయంత్రం ఫస్టు సింగిల్ సాంగ్
- ఫిబ్రవరి 14న సినిమా విడుదల
ఈ నెల 20వ తేదీ సాయంత్రం 4 గంటల 05 నిమిషాలకి ఫస్టు సింగిల్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేశారు. మ్యూజిక్ వింటూ నాయకా నాయికలు ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఈ పోస్టర్లో కనిపిస్తున్నారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా కోసమే విజయ్ దేవరకొండ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి మరి.