రజనీకాంత్ స్ఫూర్తితోనే సినిమాల్లోకి వచ్చాను: నటుడు బాబీసింహా
- బాబీసింహా తాజా చిత్రంగా 'డిస్కోరాజా'
- రవితేజతో తలపడే విలన్ పాత్ర
- రజనీ మనసున్న మనిషన్న బాబీసింహా
"మొదటి నుంచి కూడా నేను రజనీకాంత్ గారి సినిమాలను ఎక్కువగా చూసేవాడిని. రజనీకాంత్ గారి స్టైల్ .. ఆయన డైలాగ్ డెలివరీ అంటే నాకు ఇష్టం. ఆయన స్ఫూర్తితోనే నేను సినిమాల్లోకి వచ్చాను. 'జిగర్తాండ' సినిమా సమయానికి నేను పాప్యులర్ కాదు. కానీ రజనీకాంత్ గారు నన్ను మెచ్చుకున్నారు. ఆయనని కలవడానికి వెళితే ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. రజనీకాంత్ గారు సూపర్ హీరో .. అంతకు మించిన మంచి మనసున్న మనిషి" అని చెప్పుకొచ్చాడు.