ఒక్క వారంలోనే 35 సినిమాలు ఒప్పుకున్నాను: పోసాని
- పరుచూరి దగ్గర అసిస్టెంట్ గా చేశాను
- 'మెంటల్ కృష్ణ'తో నటుడినయ్యాను
- ఇంతవరకూ ఖాళీగా లేనన్న పోసాని
రచయితగా 100 సినిమాల వరకూ పనిచేసిన తరువాత దర్శకుడినయ్యాను. దర్శకుడిగా కొనసాగుతున్న సమయంలోనే 'మెంటల్ కృష్ణ' సినిమాతో నటుడినయ్యాను. ఆ సినిమాతో నటుడిగా మంచి పేరు వచ్చింది. ఆ తరువాత 'నాయక్' సినిమాలో చేసిన పాత్ర బాగా పేలింది. ఆ తరువాత వరుసబెట్టి ఆఫర్లు వచ్చాయి. అలా ఒక్క వారంలోనే 35 సినిమాలకి సైన్ చేశాను. ఈ 30 యేళ్లలో నేను ఇంతవరకూ ఖాళీగా లేకపోవడమే విశేషం" అని చెప్పుకొచ్చారు.