'డిస్కోరాజా' ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఖరారు
- ఈ నెల 19వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్
- 24వ తేదీన సినిమా విడుదల
- రవితేజ సరసన ముగ్గురు భామలు
హైదరాబాద్ లోని 'ఎన్ కన్వెన్షన్ సెంటర్' ఈ వేడుకకి వేదికగా మారనుంది. ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తుండటం విశేషం. ఆయన సరసన నాయికలుగా నభా నటేశ్ .. పాయల్ రాజ్ పుత్ .. తాన్యా హోప్ కనిపించనున్నారు. తమిళనాట స్టార్ ఇమేజ్ వున్న బాబీసింహా ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటించాడు. రవితేజ కెరియర్లో ఈ సినిమా ప్రత్యేక స్థానంలో నిలవడం ఖాయమనే నమ్మకంతో అభిమానులు వున్నారు.