రెజీనా కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం
- ఆ మధ్య వెనుకబడిన రెజీనా
- 'ఎవరు' హిట్ తో పుంజుకున్న కెరియర్
- సెట్స్ పైకి వెళ్లిన ద్విభాషా చిత్రం
ఈ సినిమా కొంతసేపటి క్రితం పూజా కార్యక్రమాలను జరుపుకుంది. రాజశేఖర్ వర్మ నిర్మిస్తున్న ఈ సినిమాకి కార్తీక్ రాజు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇంతకుముందు ఆయన తెరకెక్కించిన 'నిను వీడని నీడని నేనే' సక్సెస్ ను సాధించింది. దాంతో ఈ సారి ఆయన నాయికా ప్రాధాన్యత కలిగిన కథను ఎంచుకుని రంగంలోకి దిగాడు. తెలుగుతో పాటు తమిళంలోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో ఈ రెండు భాషల్లో రెజీనా దశ తిరిగిపోతుందేమో చూడాలి.

