బ్యాక్ గ్రౌండ్ తో వచ్చినా మేం కూడా చాలా కష్టాలు పడ్డాం: అల్లు అర్జున్
- సంక్రాంతి కానుకగా వస్తున్న 'అల... వైకుంఠపురములో'
- జనవరి 12న రిలీజ్
- మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బన్నీ
తన తండ్రి అల్లు అరవింద్ నిర్మాత కావడంతో టాలీవుడ్ ఎంట్రీ ఎంతో సులభంగా జరిగిపోయిందని వెల్లడించారు. అయితే, తన బ్యాక్ గ్రౌండ్ అంతవరకే పనిచేసిందని, ఆ తర్వాత కష్టాలు తప్పలేదని వివరించారు. ఎంత సినీ కుటుంబం నుంచి వచ్చినా తమ కష్టాలు తమకుంటాయని తెలిపారు. స్వయంకృషితో ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న నటులంటే తనకు ఎంతో గౌరవం అని బన్నీ చెప్పారు. వారిని చాలా గౌరవిస్తానని అన్నారు.