ఆ స్టార్ కమెడియన్ కి నాపై ఎందుకు కోపం వచ్చిందో తెలియదు: నటుడు శివారెడ్డి
- నాకు ఎవరితోనూ గొడవలు లేవు
- వివాదాలకు మొదటి నుంచి దూరం
- ఆయన అలా చేస్తే బాగుండేదన్న శివారెడ్డి
తాజా ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని గురించి శివారెడ్డి ప్రస్తావించాడు. "మొదటి నుంచి కూడా నేను ఎలాంటి వివాదాల జోలికి వెళ్లను. ఎవరితో గొడవలు .. మనస్పర్థలు లేవు. అయితే ఒక స్టార్ కమెడియన్ కి మాత్రం నాపై కోపం వచ్చింది. అది ఎందుకన్నది నిజంగానే నాకు తెలియదు. నా ప్రవర్తన .. మాట తీరు ఆయనను నొప్పించాయేమోనన్నది కూడా నాకు తెలియదు. కాకాపట్టే వాళ్లను ప్రోత్సహించాలా? కష్టపడేవాళ్లను ప్రోత్సహించాలా? అనేది ఆయన ఆలోచన చేసి వుంటే బాగుండేది" అని చెప్పుకొచ్చాడు.