చిత్తూరు జిల్లా జల్లికట్టు పోటీలకు వచ్చిన తమిళనాడు యువకులు... తీవ్ర ఉద్రిక్తత!
- రామకుప్పం మండలంలో జల్లికట్టు
- అనుమతి లేకున్నా నిర్వహణ
- తమిళనాడు యువకులతో స్థానిక యువకుల ఘర్షణ
వీరి మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో ఐదుగురికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు, గ్రామంలో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో జల్లికట్టుకు అనుమతి లేదని, అయినా నిర్వాహకులు వినకుండా నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. జల్లికట్టు సందర్భంగా గ్రామంలో మద్యం ఏరులై పారుతున్నా, అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారని, ఉద్రిక్తతలకు అదే కారణమని స్థానిక ప్రజలు ఆరోపించారు.