రెగ్యులర్ షూటింగుకి సిద్ధమవుతున్న 'పింక్' రీమేక్
- తెలుగులోకి 'పింక్' రీమేక్
- ఈ నెల 20వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్
- త్వరలో జాయిన్ కానున్న పవన్
ఈ నెల 20వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగుకి వెళ్లనున్నట్టుగా సమాచారం. ముందుగా పవన్ పాత్రకి సంబంధం లేని ఇతర సన్నివేశాలను చిత్రీకరిస్తారట. ఆ తరువాత పవన్ ఈ సినిమా షూటింగులో జాయిన్ అవుతాడని అంటున్నారు. హిందీలో విజయవంతమైన 'పింక్' సినిమా, ఆ తరువాత తమిళ రీమేక్ గాను సక్సెస్ ను సాధించింది. దాంతో సహజంగానే తెలుగు రీమేక్ పై అంచనాలు వున్నాయి.