గుర్తుండిపోయే పాత్రలు చేయడమే ఇష్టం: హీరోయిన్ అంజలి
- సీనియర్ స్టార్ హీరోల సరసన నటించాను
- 'సీత' పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టింది
- బలమైన పాత్రలకే ప్రాధాన్యతనిస్తానన్న అంజలి
నాకు వచ్చిన అవకాశాలను నేను సద్వినియోగం చేసుకుంటూ వెళుతున్నాను. పది సినిమాలు చేసేయాలని నేను ఆశపడను .. పది సంవత్సరాల పాటు గుర్తుండిపోయే సరైన పాత్ర ఒకటి చేస్తే చాలు అని అనుకుంటాను. అలా అనుకోవడం వల్లనే 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' వంటి సినిమా చేయగలిగాను. అందులోని 'సీత'పాత్రను ఇంతవరకూ ఎవరూ మరిచిపోలేదు. సినిమాల సంఖ్య కంటే బలమైన పాత్రలు నిలబెడతాయని నేను నమ్ముతాను" అని చెప్పుకొచ్చింది.