ఆ చిన్నపిల్లోడు ఈరోజు సూపర్ స్టార్ అయ్యాడు: నటి విజయశాంతి
- డబ్బింగ్ చెప్పేటప్పుడు ఈ సినిమా చూశాను
- చాలా బాగా వచ్చింది.. డిగ్నిఫైడ్ క్యారెక్టర్ చేశాను
- ‘సరిలేరు నీకెవ్వరు’ బిగ్గెస్ట్ హిట్ అవుతుంది
ఈ సందర్భంగా 1988లో వచ్చిన కొడుకుదిద్దిన కాపురం చిత్రం గురించి ఆమె ప్రస్తావించారు. ఈ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా మహేశ్ బాబు నటించాడని చెబుతూ, అందులో ఓ సన్నివేశం గురించి ఆమె గుర్తుచేసుకున్నారు. మహేశ్ బాబు చెంపపై తాను కొట్టాల్సిన సన్నివేశం షూటింగ్ జరుగుతున్నప్పుడు.. ఎంతో క్యూట్ గా ఉన్న మహేశ్ బాబు చెంపపై కొట్టేందుకు తనకు మనసు రాలేదని, దాంతో ఎన్నో టేక్స్ తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఆ చిన్న పిల్లోడు ఈరోజు సూపర్ స్టార్ అనీ, మళ్లీ ఆ బిడ్దతో కలిసి యాక్టు చేస్తానని అనుకోలేదని అన్నారు.