మీ కోరిక చెప్పండి... కొన్నయినా కచ్చితంగా తీరుస్తా: ఫ్యాన్స్ కు విజయ్ దేవరకొండ బంపరాఫర్
- రెండేళ్లుగా 'దేవరాశాంటా' నిర్వహిస్తున్న విజయ్
- ఈ సంవత్సరం మరికాస్త ప్రత్యేకంగా ప్రోగ్రామ్
- అభిమానులను ఏం కావాలో అడిగిన స్టార్ హీరో
ఈ మేరకు ఓ వీడియోను పోస్ట్ చేస్తూ, ఎవరికి ఏం కావాలో చెబితే, అందిస్తానని అన్నారు.
తాను నిజమే చెబుతున్నానని, కనీసం తొమ్మిది, పదిమంది కోరికలనైనా తీరుస్తానని అన్నారు. వీలైనంత ఎక్కువ మందికి బహుమతులు పంపుతానని చెప్పారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను పెట్టారు. ఇక ఈ వీడియోను చూసిన అభిమానులంతా, తమ కోరికల చిట్టాను విజయ్ ముందు విప్పుతున్నారు. మరిక వాటిల్లో ఎన్ని తీరుతాయో వేచి చూడాలి.