గోపీచంద్ జోడీగా ఛాన్స్ కొట్టేసిన దిగాంగన
- సంపత్ నంది నుంచి విభిన్న కథా చిత్రం
- ఫీమేల్ కబడ్డీ టీమ్ కోచ్ గా గోపీచంద్
- ప్రధాన కథానాయికగా తమన్నా
గోపీచంద్ హీరోగా యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ను రూపొందించడానికి దర్శకుడు సంపత్ నంది ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఈ సినిమాలో ఒక కథానాయికగా తమన్నాను ఎంపిక చేసుకున్నాడు. మరో కథానాయికగా 'దిగాంగన'ను తీసుకున్నారనేది తాజా సమాచారం. ఆంధ్ర ఫీమేల్ కబడ్డీ టీమ్ కోచ్ గా గోపీచంద్ .. తెలంగాణ ఫీమేల్ కబడ్డీ టీమ్ కోచ్ గా తమన్నా కనిపించనున్నారు. దిగాంగన పాత్ర ఏమిటనేదే తెలియాల్సి వుంది.