సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- వెబ్ సీరీస్ లో నటిస్తున్న హెబ్బా పటేల్
- మామగారితో అల్లుడి మరో సినిమా
- ఫిలిం ఫేర్ అవార్డుల హోస్టుగా సందీప్ కిషన్
* ఆమధ్య రజనీకాంత్ తో ఆయన అల్లుడు హీరో ధనుశ్ 'కాలా' చిత్రాన్ని నిర్మించిన సంగతి విదితమే. ఇప్పుడు మళ్లీ ఆయనతో మరో చిత్రాన్ని నిర్మించనున్నాడు. రజనీ నటించే 169వ చిత్రానికి ధనుశ్ నిర్మాతగా వ్యవహరిస్తాడట.
* భారత సినీ ప్రపంచంలో ఫిలిం ఫేర్ పత్రిక ఇచ్చే అవార్డులకు ఓ ప్రత్యేకత వుంది. ఇక అందులో పాల్గొనడం కూడా ఓ చక్కని అనుభవంగా భావిస్తుంటారు. త్వరలో చెన్నైలో జరిగే ఈ ఏడాది ఫిలిం ఫేర్ అవార్డుల ప్రదానోత్సవానికి యంగ్ హీరో సందీప్ కిషన్, హీరోయిన్ రెజీనా హాస్టులుగా వ్యవహరించనున్నారు.