సెన్సార్ పూర్తిచేసుకున్న 'మత్తు వదలరా'
- హీరోగా కీరవాణి తనయుడు
- దర్శకుడిగా రితేశ్ పరిచయం
- ఈ నెల 25వ తేదీన విడుదల
మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే ఈ సినిమాకి, కీరవాణి పెద్ద తనయుడు కాలభైరవ సంగీతాన్ని సమకూర్చాడు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డువారు ఈ సినిమాకి U/A సర్టిఫికెట్ ను మంజూరు చేశారు. డిసెంబర్ 25వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. కొత్త టీమ్ తో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.