"నేను మహా చెడ్డ పోలీసును"... రజనీకాంత్ 'దర్బార్' ట్రైలర్ ఇదిగో!
- మురుగదాస్ డైరెక్షన్ లో రజనీకాంత్ దర్బార్
- జనవరి 9న రిలీజ్
- అఫీషియల్ ట్రైలర్ విడుదల
"అయాం ఏ బ్యాడ్ కాప్" (నేను మహా చెడ్డ పోలీసును) అంటూ రజనీ చెప్పే డైలాగు అభిమానులను తప్పకుండా అలరిస్తుంది. "పోలీసుల వద్దకు లెఫ్ట్ లో రావొచ్చు, రైట్ లో రావొచ్చు కానీ స్ట్రెయిట్ గా రాకూడదు" అనే డైలాగ్ మరింత రక్తికట్టించేలా ఉంది. లైకా ప్రొడక్షన్స్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన 'దర్బార్' లో రజనీకాంత్ 'ఆదిత్య అరుణాచలం' అనే పోలీసాఫీసర్ పాత్ర పోషించారు. ముంబయి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ప్రతినాయక పాత్ర పోషించాడు.