గవర్నర్ తమిళిసైని కలిసిన హాజీపూర్ ఘటనల బాధిత కుటుంబాలు
- నిందితుడు శ్రీనివాస్ రెడ్డికి ఉరిశిక్ష విధించాలి
- మా కుటుంబాలకు తగిన న్యాయం కావాలి
- గవర్నరుకు వినతిపత్రం ఇచ్చిన బాధిత కుటుంబాలు
గవర్నర్ తో భేటీ అనంతరం మీడియాతో బాధిత కుటుంబాలు మాట్లాడుతూ, నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని ఎన్ కౌంటర్ చేయాలని కోరారు. దిశ ఘటనలో నిందితులను ఎలా అయితే హతమార్చారో శ్రీనివాస్ రెడ్డిని కూడా అదేవిధంగా చంపాలని అన్నారు. బీసీ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, హాజీపూర్ వరుస ఘటనల గురించి తనకు తెలుసని తమిళిసై చెప్పారని, బాధిత కుటుంబాల వినతిపై ఆమె సానుకూలంగా స్పందించారని అన్నారు.