పార్టీలో కాదు పవన్ కల్యాణ్ లోనే మార్పు వచ్చింది: రాజు రవితేజ
- పార్టీ సిద్ధాంతాలకు భిన్నంగా నడుస్తున్నారు
- అందుకే ఆ పార్టీ నుంచి బయటకొచ్చేశా
- పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదు
పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని.. ఇందుకు ఉదాహరణలు చెప్పాలంటే కోకొల్లలు వున్నాయని అన్నారు. పాప్యులర్ అయ్యేందుకనే పవన్ కల్యాణ్ పై విమర్శలు చేస్తున్నారని గతంలో పలుమార్లు వ్యాఖ్యలు చేశారు కదా, మరి, ఇప్పుడు మీకు కూడా ఈ వ్యాఖ్యలు వర్తిస్తాయా? అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, అలా అనుకునే అవకాశం ఉందని, అయితే, తాను ఎందుకు విమర్శలు చేస్తున్నానో పవన్ కల్యాణ్ కు తెలుసని అన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ , నేతలు, నాయకులు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి వుండాలని సూచించారు.