రణ్ వీర్ సింగ్ జోడీగా ఛాన్స్ కొట్టేసిన శాలినీ పాండే
- 'అర్జున్ రెడ్డి' హీరోయిన్ గా ఫుల్ క్రేజ్
- తెలుగు .. తమిళ భాషల్లో అంతగారాని అవకాశాలు
- బాలీవుడ్ నుంచి భారీ ఛాన్స్
ఈ నేపథ్యంలో ఈ సుందరి బాలీవుడ్ బాట పట్టేసింది. మొత్తానికి ఆమె ప్రయత్నాలు ఫలించి గట్టి అవకాశమే చేతికి చిక్కింది. రణ్ వీర్ సింగ్ హీరోగా యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో మనీశ్ శర్మ ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం శాలినీ పాండేను ఎంపిక చేశారు. దాంతో ఆమె ఫుల్ ఖుషీ అవుతోంది .. ఈ సినిమాతో తన దశ తిరిగిపోతుందని భావిస్తోంది.