మళ్లీ తెలుగుపై దృష్టి పెట్టిన శ్రుతి హాసన్
- బాలీవుడ్ పై దృష్టిపెట్టిన శ్రుతి హాసన్
- రవితేజ సినిమాతో రీ ఎంట్రీ
- మరోసారి మహేశ్ తో జోడీ
హిందీతో పాటు తెలుగులోను సినిమాలు చేయడానికి శ్రుతి హాసన్ ఉత్సాహాన్ని చూపుతోంది. ఈ నేపథ్యంలోనే రవితేజ - గోపీచంద్ మలినేని సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. అలాగే మహేశ్ బాబు తదుపరి సినిమాలోను అవకాశాన్ని దక్కించుకుందనేది తాజా సమాచారం. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా నిర్మితం కానుంది. మహేశ్ బాబుతో చేయడానికి చాలామంది హీరోయిన్లు పోటీపడుతుంటే, ఇంత గ్యాప్ తీసుకున్న శ్రుతి హాసన్ కి మరోసారి ఆయన జోడీగా అవకాశం లభించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయంగానే చెప్పుకోవాలి.