అసలు రిలేషన్ షిప్ ఇప్పుడు మొదలైంది: శ్రీముఖితో రాహుల్ సిప్లిగంజ్ సెల్ఫీ
- ఇటీవలే ముగిసిన బిగ్ బాస్-3
- విజేతగా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్
- ఆసక్తి కలిగించిన శ్రీముఖితో వివాదాలు
"అసలు రిలేషన్ ఇప్పుడే మొదలైంది" అంటూ రాహుల్ పోస్టు చేసిన సెల్ఫీ ఫొటోకు విపరీతమైన స్పందన వస్తోంది. శ్రీముఖి కూడా ఇదే ఫొటోను పోస్టు చేసింది. దీనికి "గతం గతః" అంటూ క్యాప్షన్ కూడా పెట్టారు. మొత్తమ్మీద వాళ్లిద్దరూ బిగ్ బాస్ ఇంట్లో వివాదాలను అక్కడే వదిలేసి వచ్చినట్టు తాజా పిక్ చెబుతోంది. ఈ షోలో రాహుల్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. విన్నర్ అవుతుందనుకున్న శ్రీముఖి రన్నరప్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.