ఇలాంటి ఘటనలపై ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతున్నారు: మమ్ముట్టి
- దిశ హత్యోదంతం దిగ్భ్రాంతికి గురి చేసింది
- ఇలాంటి ఘోరాలకు పాల్పడేవారు వారిని వారే ప్రశ్నించుకోవాలి
- ఏం చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో ఆలోచించాలి
దిశ ఘటన యావత్ దేశాన్ని కదిలిస్తోంది. దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పార్లమెంటు ఉభయసభలు కూడా ఈ అంశంపై ఒక రోజంతా చర్చించింది. దేశ సినీ పరిశ్రమకు చెందిన ఎందరో సెలబ్రిటీలు ఈ ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.