దూసుకుపోతున్న 'చూసీ చూడంగానే' ట్రైలర్
- తెలుగు తెరకి మరో ప్రేమకథ
- కథానాయకుడిగా శివ పరిచయం
- నాయికలుగా వర్ష - మాళవిక
నిన్న విడుదల చేసిన ట్రైలర్ సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా నిర్మితమవుతున్నట్టు ఈ ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. ప్రేమ .. ప్రేమికుల మధ్య అలకలు .. గొడవలు .. కుటుంబ సభ్యుల మధ్య ఎమోషన్స్ తో ఈ ట్రైలర్ సాగింది. ప్రధాన పాత్రల కాంబినేషన్లోని ముఖ్యమైన సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ యూత్ ను ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది.