వరలక్ష్మి శరత్ కుమార్ దుమ్మురేపేస్తుందట!
- రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని సినిమా
- కథానాయిక పాత్రలో శ్రుతి హాసన్
- పవర్ఫుల్ రోల్ లో వరలక్ష్మి శరత్ కుమార్
తాజాగా ఆమె రవితేజ సినిమాలోను ఒక పాత్రను పోషిస్తోంది. రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, ఒక కీలకమైన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ ను తీసుకున్నారు. మరో హీరోయిన్ గా ఆమె రవితేజతో ఆడిపాడే సన్నివేశాలు ఉన్నప్పటికీ, ఆమె పాత్ర విభిన్నంగా ఉంటుందని అంటున్నారు. విలక్షణమైన ఈ పాత్రలో ఆమె దుమ్మురేపేస్తుందని చెబుతున్నారు. ఈ సినిమాతో తెలుగులోను వరలక్ష్మి శరత్ కుమార్ బిజీ కావడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.