కర్ణాటకలో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని బ్రహ్మానందం ప్రచారం!
- కర్ణాటకలో ముగింపు దశకు ప్రచారం
- ఉద్ధృతంగా సాగుతున్న నేతల ప్రచారం
- చిక్కబళ్లాపురలో బ్రహ్మానందం ప్రచారం
ఇక బెంగళూరు యశ్వంతపుర నుంచి తమ పార్టీ తరఫున బరిలోకి దిగిన ఎస్టీ సోమశేఖర్ తరఫున సీఎం యడియూరప్ప ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థుల గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీ, విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డుతోంది. మరోవైపు కాంగ్రెస్, జేడీఎస్ సైతం, తమ స్థానాలను నిలుపుకోవాలన్న లక్ష్యంతో శ్రమిస్తోంది. కాగవాడలో జేడీఎస్ అభ్యర్థికి మద్దతుగా మాజీ సీఎం కుమారస్వామి ప్రచారం నిర్వహించారు.
ఈ ఎన్నికల్లో కొన్ని చోట్ల కాంగ్రెస్, జేడీఎస్ మధ్య, మరికొన్ని చోట్ల కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు తప్పదని తెలుస్తోంది. ముఖ్యంగా హొసకోటె, గోకాక్ హుణసూరు, కృష్ణరాజపేటె, విజయనగర, యశవంతపుర నియోజకవర్గాల్లో భారీ బెట్టింగ్ లు జరుగుతున్నాయని తెలుస్తోంది.