అమృతకు ప్రలోభాలు... మిర్యాలగూడ మారుతీరావు మళ్లీ అరెస్ట్!
- తీవ్ర కలకలం రేపిన ప్రణయ్ హత్య కేసు
- తాజాగా ఆస్తి పంపకాలంటూ ప్రలోభాలు
- ముగ్గురిని అరెస్ట్ చేసిన మిర్యాలగూడ పోలీసులు
ఆస్తి పంపకాలపై తనను ప్రలోభ పెట్టాలని తండ్రి ప్రయత్నిస్తున్నారని, తన ఇంటికి వెంకటేశ్వరరావు అనే వ్యక్తిని పంపారని అమృత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైంది. కులం తక్కువ యువకుడిని అమృత ప్రేమ వివాహం చేసుకుందన్న ఆగ్రహంతో, మారుతీరావు పరువు హత్యకు పాల్పడగా, ఈ హత్య దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.