1980ల్లో నటించిన సీనియర్ యాక్టర్లందరూ ప్రతి ఏటా రీయూనియన్ పేరుతో ఒక్క చోటుకు చేరి, సందడి చేయడం తెలిసిందే. గత తొమ్మిదేళ్లుగా ఈ మీట్ జరుగుతోంది. ఈ సారి మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఈ పార్టీ జరిగింది. ఈ పార్టీకి అలనాటి స్టార్లంతా హాజరై సందడి చేశారు. ఖుష్బూ, రాధిక, సుమలత, నదియా, భాగ్యశ్రీ, రమ్యకృష్ణ, జయసుధ, లిజీ, పూర్ణిమ భాగ్యరాజ్.. వెంకటేష్, భానుచందర్, నరేష్, సురేష్, వెంకటేష్, నాగార్జున లాంటి చాలా మంది స్టార్స్ ఈ పార్టీకి వచ్చారు. ఈ సందర్భంగా ఖుష్బూ, జయప్రదలతో కలిసి చిరంజీవి స్టెప్పులేశారు. చిరంజీవి ఎనర్జీకి తగ్గట్టుగా వారు కూడా డ్యాన్స్ చేసి అలరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.