'జబర్దస్త్' నా షో అనుకుని చేశాను: నాగబాబు
- ఒక కుటుంబంలా కలిసి ఉండేవాళ్లం
- కష్టసుఖాలను పంచుకునే వాళ్లం
- పారితోషికం సమస్యే కాదన్న నాగబాబు
తాజాగా ఆయన మాట్లాడుతూ .. 'జబర్దస్త్' షోకి నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి అయినప్పటికీ .. ఇది మల్లెమాల షో అని కొందరు .. ఈటీవీ షో అని మరికొందరు అన్నప్పటికీ నేను ఆ విషయాలను గురించి పెద్దగా ఆలోచించలేదు. ఎందుకంటే ఇది నా షో అనుకుని చేసేవాడిని. 'జబర్దస్త్'కి సంబంధించిన వాళ్లమంతా ఒక కుటుంబంలా కలిసి ఉండేవాళ్లం. ఏ ఒక్కరికి కష్టం వచ్చినా మిగతా వాళ్లమంతా కలిసి ఆదుకునేవాళ్లం. అక్కడి నుంచి నేను బయటికి రావడానికి పారితోషికం కారణం కానేకాదు .. అలా అని జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదు" అని స్పష్టం చేశారు.